నేటి ఆధునిక కాలంలో కోట్లాది మందిని సతమతం చేస్తున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి.నిద్రలేమి అనేది చిన్న సమస్యగానే కనిపించిన నిర్లక్ష్యం చేస్తే అనేక అనర్థాలకు కారణం అవుతుంది.
కంటి నిండా నిద్ర లేకపోతే నీరసం, అలసట చుట్టూ ముట్టేస్తాయి.ఒత్తిడి, చిరాకు తారాస్థాయికి చేరుకుంటాయి.
అలాగే నిద్రలేమి క్రమంగా కొనసాగితే గుండె పోటు, మెదడు పని తీరు మందగించడం, రక్తపోటు అదుపు తప్పడం తదితర సమస్యలు తలెత్తుతాయి.అందుకే వీలైనంత వరకు నిద్రలేమిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి.
అందుకు మందులే వాడాల్సిన అవసరం లేదు.సహజంగా కూడా నిద్రలేమిని వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే నిద్రలేమి అన్న మాటే అనరు.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అరటి పండును తీసుకొని పీల్ తొలగించే సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు ఆప్రికార్ట్స్, ఒక ఎండిన అత్తి పండు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్, మూడు వాల్ నట్స్, కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, ఒకటిన్నర గ్లాస్ గోరువెచ్చని బాదం పాలు వేసుకుని అర గంట పాటు నానబెట్టుకోవాలి.
అనంతరం నానబెట్టుకున్న పదార్థాలు అన్ని బ్లెండర్ లో వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ బనానా డ్రై ఫ్రూట్స్ డ్రింక్ ను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.ప్రశాంతమైన మరియు సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
అలాగే నీరసం, అలసట దూరం అవుతాయి.ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.
మరియు మెదడు పనితీరు సైతం మెరుగుపడుతుంది.