ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామరాజుపై వేటు పడటం ఖాయమనిపిస్తోంది.వేటు పడుతుందా? లేకుంటే అంతకు ముందే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అనే చర్చలు మొదలయ్యాయి.ఆయనపై నమోదైన అనర్హత పిటిషన్ స్పీడ్ అందుకుంటోంది.ఆయనపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది.ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా తనపై వేటు వేయించలేరంటూ ఎంపీ రఘురామరాజు ఛాలెంజ్ చేస్తున్నారు.తనపై అనర్హత వేటు వేయించాలని పార్టీకి వచ్చేనెల 5వరకు డెడ్ లైన్ పెట్టారు.
తనపై వేటు వేయించడం వైసీపీ వల్ల కావడం లేదని చెబితే తనంతట తానే రాజీనామా చేస్తానని సైతం ఆఫర్ ఇచ్చారు.ఇక ఆయన పెట్టిన గడువు దగ్గరపడుతుండటంతో హఠాత్తుగా ఆయనపై అనర్హత వేటు విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటికి తాజాగా పంపించారు.
రాఘురామరాజుపై అనర్హత వేటు విషయం గురించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటిని స్పీకర్ ఆదేశించారు.
పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారిపైనా అనర్హత పిటీషన్ పెండింగ్‌లోనే ఉంది.
తృణమూల్ నుంచి ఎంపీగా విజయం సాధించిన శిశిర్ గతేడాది బీజేపీలోకి జంప్ అయ్యారు.
అప్పటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేయించాలని తృణమూల్ ట్రై చేస్తూనే ఉంది.వీరిద్దరికి బీజేపీ పాటు కేంద్రంలోని పెద్దల సపోర్ట్ ఉన్నందున ఫిర్యాదుల విషయంలో స్పీకర్ స్పందించలేదు.ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల కారణంగా ఫిర్యాదులను ఎక్కువ రోజులు పెండింగ్‌లో పెడితే మొదటికే మోసం వస్తుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్టు సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికలు వంటి కీలక అంశాలను ప్రధాని మోడీ ముందు ఉన్నాయి.దీంతో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రాఘురామరాజుపై అనర్హత ఫిర్యాదు ప్రక్రియను స్పీడప్ చేశారు.
మరి వేటు వేస్తారా? లేదా అనేది వేచి చూడాలి.