ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తో గెలిచి నూతన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి అనంతరం నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.
అక్కడ తొలుత గవర్నర్ ను మర్యాదపూర్వంగా కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ సీఎంను కలుస్తారు జగన్.
రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్‌తో సమావేశమవుతారు.ఈ నెల 30 న జగన్ ఏపీ సీ ఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ని ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఎన్నికల ఫలితాలతో పాటూ భవిష్యత్ రాజకీయాలపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది.
అలానే ఈ నెల 26న (ఆదివారం) జగన్ ఢిల్లీకి కూడా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఈ నెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్‌కు గురువారం మోదీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.ట్వీట్‌లో ‘ప్రియమైన వైఎస్ జగన్.ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు.మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ఇవే శుభాకాంక్షలు’ అంటూ మోడీ తెలిపారు.