సమ్మర్ స్కిన్ గ్లోయింగ్ సీరం.. రోజు వాడితే ఊహించని లాభాలు మీ సొంతం!

సమ్మర్ సీజన్ ప్రారంభం అయ్యింది.ఈ సీజన్ లో ఎండల కారణంగా చర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.

 Best Homemade Serum For Glowing Skin In Summer! Homemade Serum, Glowing Skin, Se-TeluguStop.com

అందుకే చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.అయితే వేసవిలో మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరియు గ్లోయింగ్ గా మెరిపించేందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

రోజు ఈ సీరంను వాడితే ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం అవుతుంది.మ‌రి ఆలస్యమెందుకు ఆ సమ్మర్ స్కిన్ గ్లోయింగ్ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Skin, Homemade Serum, Latest, Serum, Skin Care, Skin Care Tips, Ski

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు బ్లాక్ టీ పౌడర్ ( Black tea powder )వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బ్లాక్ టీ ని ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea tree essential oil ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Homemade Serum, Latest, Serum, Skin Care, Skin Care Tips, Ski

ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్లు బ్లాక్ టీ, ఆరు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్( Rose water ) వేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.అంతే మన సీరం సిద్ధం అయినట్లే.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరంను అప్లై చేసుకోవాలి.ప్రస్తుత వేసవి కాలంలో ఈ సీరం ను రెగ్యులర్ గా వాడితే చర్మం రంగు తగ్గకుండా ఉంటుంది.స్కిన్ గ్లోయింగ్( Glowing skin ) గా మెరుస్తుంది.

సన్ ట్యాన్ సమస్య దూరం అవుతుంది.మొటిమలకు దూరంగా ఉండవచ్చు.

మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.మరియు చర్మం తేమగా మృదువుగా సైతం మారుతుంది.

కాబట్టి ప్రస్తుత సమ్మర్ సీసన్ లో తప్పకుండా ఈ గ్లోయింగ్ సీరం ను తయారుచేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube