ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న విషయం తెల్సిందే.ముస్లీంలు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో వారు ఉదయం నుండి సూర్యాస్థమయం వరకు కూడా ఉపవాసం ఉంటారు.
సూర్యాస్థమయం అయిన తర్వాత అప్పుడు ఇప్తార్ చేస్తారు.ఇప్తార్ అంటే రుచికరమైన బిర్యానీ, పలావ్ మరియు హలీమ్ అయ్యి ఉంటుంది.
సాదారణంగా ఇంట్లో హలీమ్ తయారు చేయించుకోరు కాని ఇప్తార్ మాత్రం తప్పకుండా చేస్తారు.కాని కువైట్‌కు చెందిన ఒక వ్యక్తికి మాత్రం ఆయన భార్య ఇప్తార్ వండటం లేదట.
దాంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
పవిత్ర ఈ రంజాన్ మాసంలో ముస్లీం సమాజం మొత్తమే కాకుండా అంతా కూడా అవాక్కయి చూస్తున్న ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కువైట్‌కు సంబంధించిన ఒక వ్యక్తి తాజాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం జరిగింది.అతడు పోలీసులకు తన భార్య ఉపవాసం పూర్తి చేసిన నాకు ఇప్తార్ వింధు ఏర్పాటు చేయడం లేదు, ఆమె అసలు మామూలుగా కూడా వండేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.అతడు ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు అవాక్కయ్యారు.
అతడి బాధను అర్థం చేసుకున్న పోలీసులు ఫిర్యాదును మాత్రం స్వీకరించేందుకు నిరాకరించారు.ఇది మరీ చిల్లర వ్యవహారం, ఇలాంటి విషయాలకు కేసు నమోదు చేయడం కుదరదు.మీ ఫ్యామిలీ వ్యవహారం మీరే సెటిల్ చేసుకోవాలంటూ సూచించింది.దాంతో అతడు నిరాశగా వెనుదిరిగాడు.ఈ విషయం ఆనోట ఈనోట పడి వైరల్ అయ్యింది.దాంతో ఇప్పుడైనా ఆయన భార్య ఇప్తార్ ఏర్పాటు చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.
ఒక వేళ మీ భార్య ఇప్తార్ ఏర్పాటు చేయకుంటే మా వద్దకు వచ్చేయండి అంటూ చాలా మంది ఆ అభాగ్యుడి విషయమై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.మొత్తానికి అతడి పరిస్థితి దారుణం కదా.!
.