వైయస్ జయంతి నాడు పార్టీ ప్రారంభించబోతున్న షర్మిల..!!

తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.కరోనా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేయడం జరిగింది.

 Ys Sharmila Opens New Party In July 8 Ys Sharmila, Ysr, Ysrtp Party , Sharmila N-TeluguStop.com

ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది అని మండిపడుతూ వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని పేర్కొనడం జరిగింది.

అయితే ఈ కార్యక్రమాలు మొత్తం పార్టీ నేను రాకముందు రిజిస్ట్రేషన్ కాకముందు జరగడం తెలిసిందే.

పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వైయస్ టీపీ పార్టీ పేరు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరు రిజిస్టర్ కావటంతో ఈ పేరును వైయస్ జయంతి నాడు అనగా జూలై 8 వ తారీకు నాడు అధికారికంగా పార్టీ ప్రకటించాలని తాజాగా వైయస్ షర్మిల డిసైడ్ అవ్వటం జరిగిందట.

దీంతో ఆ రోజు వైఎస్ మద్దతుదారులతో చిన్నపాటి సమావేశం పెట్టి వైయస్ షర్మిల వైయస్ టీపీ పార్టీ ప్రకటించనున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube