షర్మిల పార్టీ పరిస్థితి ప్రజా రాజ్యం పార్టీలా అవనుందా

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది.అయితే షర్మిల పార్టీ పెడతానని ప్రకటించి సంచలనం రేపిన విషయం తెలిసిందే.

 Sharmila's Party Situation Is Like A People's State Part ,  Ts Poltics, Bjp, Y.-TeluguStop.com

అయితే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలా షర్మిల పార్టీ తయారవుతుందని మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ రావు సంచలన ప్రకటన చేశారు.అయితే అతి వైభవంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి ఒక్కసారిగా పార్టీ కోసం కష్టపడిన వారిని, ఆస్తులు అమ్ముకున్న వారిని రోడ్డున పడేసి కార్యకర్తల బ్రతుకులలో వెలుగులు లేకుండా చేశారు.

అయితే షర్మిల పార్టీ కూడా తాడూ బొంగరం లేకుండా ఉందని, తెలంగాణపై విషం కక్కిన షర్మిల ఇప్పుడు తెలంగాణ ప్రజల బాగు కోరుకోవడంపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని పలువురు రాజకీయ నేతలు మండిపడుతున్నారు.

అయితే తెలంగాణలోని పార్టీలు షర్మిలపార్టీపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ఈ పార్టీపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నా వీటన్నింటిని తట్టుకొని షర్మిల పార్టీ ఎలా నిలదొక్కుకుంటుందో చూడాల్సి ఉంది.అంతేకాక ఇప్పటికే పార్టీ నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన షర్మిల ఈ విమర్శలను లైట్ గానే తీసుకుంటున్నదని, తెలంగాణలో తమకు స్థానం ఉంటుందని, ప్రజల్లో వైఎస్సార్ పట్ల ప్రజలు అభిమానం కలిగి ఉన్నారని షర్మిల భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనా తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రం రాజకీయ రణరంగాన్ని తలపించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube