తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే కలహాల పార్టీ అనే పేరు నుండి ఐక్య రాగం వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ టార్గెట్ గానే ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే రాజకీయాలలో ఒక విమర్శ చేసారంటే ప్రజల దృష్టి ఒక్కసారిగా సదరు విమర్శ మీద పడుతుంది.అయితే ఆ విమర్శలో వాస్తవం లేకపోతే ప్రజలు ఇక మరే ఇతర విమర్శ చేసినా ఇక ప్రత్యేకంగా దృష్టి పెట్టే పరిస్థితి ఉండదు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ల విషయం నుండి మొదలు కొని వేల కోట్ల కుంభకోణం జరిగిందని టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ దమ్ముంటే ప్రభుత్వం చేసిన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు.ఆ తరువాత రేవంత్ రెడ్డి కూడా స్పందించకపోవడం కొసమెరుపు.
అయితే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నా వాటిని టీఆర్ఎస్ తమకు అనుగుణంగా మార్చుకుంటున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం కాంగ్రెస్.టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని ప్రయత్నిస్తున్న క్రమంలో పసలేని విమర్శలతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ గాడి తప్పుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.రాజకీయాలలో విమర్శలు సహజం కాని అవే విమర్శలతో ప్రభుత్వానికి ఆయుధంగా మారితే సదరు పార్టీ విమర్శలు అనేవి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా విమర్శల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే మరింతగా బలపడటానికి అవకాశం ఉంటుంని ఖచ్చితంగా చెప్పవచ్చు.