వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెండింతల ఉత్సాహంతో సాగిన సామాజిక సాధికార యాత్ర..

వర్షం కురుస్తున్నా లెక్కచెయ్యకుండా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.జన ప్రభంజనంతో సభా స్థలి సంద్రాన్ని తలపించింది.

 Ycp Samajika Sadhikara Bus Yatra In Allagadda, Ycp ,samajika Sadhikara Bus Yatra-TeluguStop.com

స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన సామాజిక సాధికారక యాత్రలో డిప్యూటీ సీఎంలు అజాంద్‌ బాషా, నారాయణస్వామి, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొని బహిరంగ సభలో మాట్లాడారు.గత ప్రభుత్వంలో చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను మోసం చేయడమే కాకుండా.

అబద్ధపు వాగ్దానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశార‌ని అంజాద్‌బాషా అన్నారు.కానీ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందడం మాత్రమే కాదు.

అన్ని సామాజిక వర్గాలు బాగుపడ్డాయి.ఇలా అన్నిరకాలుగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని, అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం రిజర్వేషన్లతో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని ఆంజాద్‌ బాషా గుర్తు చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టే ప్రజల్లోకి సామాజిక సాధికార యాత్ర ద్వారా ధైర్యంగా వెళ్లగల్గుతున్నామని, కానీ, చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నారని, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంజాద్ బాషా సూచించారు.

సామాజిక న్యాయమంటే నినాదం కాదు విధానమని చాటి చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌ అని, ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మైనార్టీలు నా వాళ్లే అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతారని మంత్రి నారాయణ స్వామి అన్నారు.

నవరత్నాలతో ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయని మండిపడ్డారు.తన ప్రభుత్వంలో బీసీలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు.ఇప్పుడు మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.పవన్ కల్యాణ్ కాపుల ఓట్ల కోసం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు మాట్లాడం పై చంద్రబాబుకు ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అయ్యిందని, బీసీలను ,ఎస్సీలను నాడు చంద్రబాబు అవమానిస్తూ మాట్లాడిన మాటలెవరూ మర్చిపోరని మండిపడ్డారు.చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర రాష్ట్రం దేశం అంతా తెలుసని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలందరికీ నవరత్నాల పథకాలతో మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.

ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలమైన మన కోసం పోరాడేవాడు, పౌరుషం ఉన్నవాడు మన నాయకుడు జగన్: మాజీ మంత్రి అనీల్ యాదవ్.వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా తరలివచ్చిన జగనన్న అభిమానుల్ని చూస్తుంటే, 2024లో జగనన్న గెలిచితీరతాడనడంలో సందేహమే లేదని మాజీ మంత్రి అనీల్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.తండ్రీ ఆరెస్టై జైళ్లో ఉంటే కన్న కొడుకు ఢీల్లికి వెళ్లీ కూర్చున్నాడు, కానీ, దత్తపుత్రుడు రోడ్డు మీద పడుకుని పోరాటం చేశాడు, ఇలాంటి చోద్యం ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేసుండడాని మాజీ మంత్రి అనీల్ యాదవ్ ఎద్దేవా చేశారు.

పక్కనోడు సీఎం అవ్వాలని పార్టీ పెట్టే వ్యక్తి మనకు అవసరమా? అని ప్రశ్నించారు ఇక్కడేమో టీడీపీతో అంటాడు, తెలంగాణలో బీజేపీతో పొత్తు.టీడీపీకి అక్కడేమో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం.

మళ్లీ మనం వెనక్కి పోదామా ముందుకు పోదామా అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఆలోచన చేయాలి అని అన్నారు.రాయలసీమ అంటే పౌరుషాల గడ్డని, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలమైన మన కోసం పోరాడేవాడు, పౌరుషం ఉన్నవాడు మన నాయకుడు జగన్ అని మాజీ మంత్రి ఉద్ఘాటించాడు.నిరుపేదవర్గాలకు మంచి చేసిన మన నాయకుడి వెంట ఉందామని నినాదించారు.

“సంక్షేమపథకాల వెల్లువతో బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి.విద్యావ్యవస్థలో, ఆరోగ్యరంగంలో జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95శాతం అమలు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పటికి 99శాతం హామీలు అమలు చేశారు.దేశచరిత్రతో కనీవినీ ఎరుగని రీతిలో నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.40లక్షల కోట్లను డీబీటీ ద్వారా జమ చేశారు.ఇందులో 75శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి” అని ఎంపీ చంద్రశేఖర్ పేర్కొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube