అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ ని తక్కువ చెయ్యడానికి చూస్తుంటాయి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు.ఆ రెండు పార్టీలు కి ఉన్నట్టుగా జనసేన పార్టీ కి డబ్బు బలం, మీడియా బలం లేదు.
కేవలం అభిమానుల ఆదరణతో నడుస్తున్న ఏకైక పార్టీ ఇది.తమకి ఏకులో మేకులాగా పవన్ కళ్యాణ్ తయారు అవుతున్నాడు అని ఇరు పార్టీలకు అనిపిస్తే అతని పై విషం చిమ్మడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో, అన్ని మార్గాలను ఉపయోగిస్తారు.2019 ఎన్నికలలో ఇది మనమంతా గమనించాము.ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్న జనసేన పార్టీ పై అధికార వైసీపీ పార్టీ విషం చిమ్మడానికి సిద్ధమైంది.8 మంది సభ్యులతో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తో పొత్తు పెట్టుకొని పోటీ చెయ్యడానికి సిద్దపడింది జనసేన.నేడు నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసారు.
![Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Ycp-Telugu Political News Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Ycp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/11/YCP-and-TDP-media-support-of-Jana-Sena-partys-glass-symbol-is-spreading-liesc.jpg)
అసలు విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నం అధికార వైసీపీ పార్టీ( YCP party ) కి సంబంధించిన మీడియా నుండి ఒక సంచలన వార్త బయటకి వచ్చింది.అదేమిటంటే తెలంగాణ లో జనసేన పార్టీ కి ఎన్నికల కమీషన్ గాజు గ్లాస్ గుర్తు ఇవ్వలేదని, అభ్యర్థులందరూ స్వతంత్రంగా పోటీ చెయ్యాల్సిందే అంటూ ఒక వార్త ని ప్రచారం చేసారు.దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు తమదైన శైలిలో ఈ ఫేక్ వార్తని తిప్పికొట్టారు.ఎన్నికల కమీషన్ రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చెయ్యడానికి అనుమతిస్తూ ఒక లేఖని ని అప్పట్లో విడుదల చేసింది.
దీనిని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి వైసీపీ పార్టీ నాయకులకు అదిరిపోయే రేంజ్ కౌంటర్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.అంతే కాదు ఎన్నికల కమీషన్ కూడా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.
![Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Ycp-Telugu Political News Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Ycp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/11/YCP-and-TDP-media-support-of-Jana-Sena-partys-glass-symbol-is-spreading-liesd.jpg)
వైసీపీ పార్టీ కి పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఇలా నెగటివ్ ప్రచారం చేసారు అనడం లో ఒక అర్థం ఉంది.కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా టీడీపీ( TDP ) మీడియా గుట్టు చప్పుడు కాకుండా విషం చిమ్మడాన్ని ఈరోజు మనం గమనించొచ్చు.కేవలం ఈరోజు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న చెడు జరిగినా పెట్రోల్ పొయ్యడానికి సిద్ధంగా ఉంటుంది టీడీపీ మీడియా.ఇదంతా గమనించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీ కంటే తడి గుడ్డతో గొంతు కోసే టీడీపీ జనసేన కి అత్యంత ప్రమాదకరం, చూసుకోండి అని పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు.