విప్రో బ్రాండ్ తెలియని ఇండియన్స్ ఉండనే ఉండరని చెప్పుకోవచ్చు.మొదట ఒక రకమైన సేవలకు పరిమితమైన విప్రో నేడు అనేక రకాల సేవలను అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా కేరళకు చెందిన సంప్రదాయ ఆహార బ్రాండ్ అయినటువంటి Niraparaను కొనుగోలు చేస్తున్నట్లు విప్రో కన్జ్యూమర్ కేర్ తాజాగా ప్రకటించింది.ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తోంది.
దీంతో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, మసాలాల రంగంలోకి కూడా విప్రో వచ్చేసింది.
అయితే ఇప్పటికే మసాలాల రంగంలో ఉన్న ప్రముఖ FMCG కంపెనీలైన ఇమామీ, డాబర్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ITC సరసన విప్రో కన్జ్యూమర్ చేరడం విశేషం.
అయితే ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టడానికే తాజా ఒప్పందం అనేది నిపుణుల విశ్లేషణ.కాగా Niraparaను కేరళలో 1976లో స్థాపించడం జరిగింది.ఈ బ్రాండ్ అనేక రకాల మసాలా మిశ్రమాలను అనగా ‘అప్పం’, ‘ఇడియప్పం’ మొదలైన వాటి తయారీలో ఉపయోగించే బియ్యం పిండిని ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి గాంచినది అని చెప్పుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఈ కంపెనీ వ్యాపారంలో 63% కేరళలోనే జరుగుతోంది.కాగా విప్రో సాయంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనుంది.వినియోగదారులను ఒక విశ్వసనీయ, స్వచ్ఛమైన మసాలా మిశ్రమాల వైపు మళ్లించేందుకు ఇది ఒక మంచి అవకాశమని విప్రో యాజమాన్యం ఒక నివేదికలో పేర్కొన్నారు.ఇకపోతే భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న FMCG బ్రాండ్లలో విప్రో కన్జ్యూమర్ ఒకటి.2021-22లో ఈ కంపెనీ రూ.8,630 కోట్ల ఆదాయాన్ని నివేదించింది.