మనిషా కొయిరాలా, అరవింద్ స్వామి( arvind swami ) హీరో హీరోయిన్స్ గా నటించిన బాంబే సినిమా( Bombay ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా వచ్చి దాదాపుగా 28 ఏళ్ళు అవుతుంది.
అయినా కూడా ఆ సినిమాలోని పాటలు, సన్నివేశాలు హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటాయి.ఇప్పటికీ టీవీ లో వచ్చినా కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.
ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి కన్నా కూడా మనిషా కొయిరాలా పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో మనీషా ( Manisha koirala )కన్నా ముందు మరో ఇద్దరు హీరోయిన్స్ ని షైలా భాను పాత్రా కోసం అనుకున్నారట.
మరి బాంబే సినిమాలో నటించడానికి అనుకున్న ఆ హీరోయిన్స్ ఎవరు ? ఏ కారణాల చేత వారు ఈ సినిమాను వద్దు అనుకున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొదట మణి రత్నం ఈ సినిమాకి కథ రాసినప్పుడు 1994లో ఐశ్వర్య రాయ్( AishwaryaRaiBachchan ) ని సంప్రదించారట.షైలా భాను గా ఐశ్వర్య అయితే బాగుంటుందని మణి రత్నం అనుకున్నప్పటికీ అప్పటికె ఆమె మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న కారణంగా అక్కడ సంతకం చేసింది.అందువల్ల మణిరత్నం ఇచ్చిన ఆఫర్ ను ఆమె తీసుకోలేకపోయింది.
ఇక ఐశ్వర్య రాయ్ తర్వాత వెంటనే మణిరత్నం కరిష్మా కపూర్( Karishma kapoor ) ని ఈ సినిమాలో షైలా భాను పాత్రలో నటింపజేయాలని అనుకున్నాడట.అప్పటికే బాక్సాఫీస్ వద్ద ఒక హాట్ యాక్ట్రెస్ గా కరిష్మా కి మంచి పేరుంది.అందుకే ఇద్దరు పిల్లల తల్లిగా నటించడానికి కరిష్మా ఒప్పుకోక పోవడంతో ఈ పాత్రను ఆమె వదులుకోవాల్సి వచ్చింది.ఆ తరువాత మనీషా కొయిరాలా బాంబే సినిమా కోసం ఓకే అని చెప్పి సంతకం చేసింది.
అలాగే ఈ సినిమాలో నటించిన మనీషా కు ఫిలిం ఫెర్ అవార్డు కూడా దక్కించుకుంది.ఇలా ఐశ్వర్య రాయ్, కరిష్మా కపూర్ ఇద్దరు కూడా ఒక గొప్ప చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయారు.