మన హీరో, హీరోయిన్లు నటించడమే కాదు.వారిలో దాగి ఉన్న టాలెంట్లు చాలా ఉన్నాయి.
సింగింగ్, ఆర్టిస్ట్, కీ బోర్డ్ ప్లేయర్గా కొంతమందికి మంచి ప్రావీణ్యం ఉంది.ముఖ్యంగా హీరోయిన్లకు మనకు తెలియని టాలెంట్లు చాలా ఉన్నాయి.
అనుష్క దగ్గర నుంచి కీర్తి సురేష్, శృతి హాసన్ ఇలా చాలా మంది హీరోయిన్లకు మల్టీ టాలెంట్స్ ఉన్నాయి.అలాంటి హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
అనుష్క.స్టార్ హీరోయిన్.నాగార్జున సరసన కథానాయికగా సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క.అనతి కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించింది.తెలుగు, తమిళ భాషాల్లో గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లుంది.
అయితే అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్.యోగాలో అనుష్కకు మంచి ప్రావీణ్యం ఉంది.
కమల్ హాసన్ గారాలపట్టి.తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది శృతి హాసన్.ఆమె మంచి సింగర్ అన్న విషయం చాలా మందికి తెలియదు.సినిమాల్లోకి రాకముందు ఆమె ఆల్బమ్స్ చేసింది.
కొన్ని ఆల్బమ్స్ లకు సంగీతం అందించడంతో పాటు వాటికి గాత్రం కూడా అందించింది.
మహానాటి సినిమాతో జాతీయ అవార్డు పొందిన కీర్తి సురేశ్ కూడా మంచి కళాకారిణి.ఆమె వయోలిన్ నేర్చుకుంది.విక్రమ్ స్వామి స్వ్కేర్ లో ఒక పాటను కూడా పాడారు కీర్తి సురేశ్.
ఇక అందాల తార కాజల్.లక్ష్మీ కళ్యాణ్ సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించింది.తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.ఇటీవలె ఒక కన్నడ చిత్రం కోసం పాట పాడింది.
అఆ సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లోనూ టాలెంట్లు ఉన్నాయి.ఆమె మంచి ఆర్టిస్ట్, పాటలు కూడా బాగా పాడుతారు.సినిమా కోసం పాడకపోయినా.చాలా సందర్భాల్లో పాట పాడి అందరినీ మెప్పించారు.
అలా మొదలైంది సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నిత్యామీనన్ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.తెలుగు, తమిళ, మళయాళ, ఇంగ్లీష్, హిందీ, భాషలను అనర్గళంగా మాట్లాడగలదు.అంతే కాదు పలు చిత్రాల్లో పాటలను పాడింది.అంతేకాదు గుండెజారి గల్లంతయ్యె సినిమాలో మరో హీరోయిన్ ఇషా తల్వార్ కి నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది.
ఈ సినిమాలో ఆమె కూడా హీరోయిన్ గా నటించింది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో వెండితెరపై మెరిసిన రాశీఖన్నా కూడా పాటలు బాగా పాడుతుంది.కాలేజీ డేస్ నుంచే రాశీఖన్నా సింగింగ్ పై దృష్టి పెట్టింది.ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది.
నన్ను దోచుకుందువటె హీరోయిన నభా నటేష్.గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ అందుకుంది.
తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తుందని ఆమె తో నటించిన ప్రతి హీరో చెబుతాడు.నభా నటేష్.మంచి ఆర్టిస్ట్ కూడా.ఇటీవెల వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా తయారుచేసిన నభా.పెయింటింగ్ కూడా బాగా వేయగలదు.
అర్జున్ రెడ్డి మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన షాలినీ పాండేలో కూడా మరెన్నో కళలు దాగి ఉన్నాయి.ఈ బ్యూటీ మంచి సింగర్ కూడా.ఇటీవెల ఓ ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్ కోసం షాలినీ పాటలు పాడింది.
హార్ట్అటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదా శర్మ.తర్వాత సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయింది.ఆమె మంచి జిమ్నాసిస్ట్.అంతేకాదు అదా శర్మ కీ బోర్డును కూడా ప్లే చేయగలదు.యుద్ధ విద్యలలో కూడా అదాశర్మకు ప్రావీణ్యం ఉంది.
కాటుక కళ్లే మెరిసిపోయే పిలగా నిను చూసి.అంటూ సూరారై పొట్రు సినిమాలో ఆడి పాడిన అపర్ణ బాల మురళీ కూడా మంచి సింగర్.
ప్రేమమ్ మూవీ ద్వారా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మడోన్నా సెబాప్టియన్.తెలుగులో మరే చిత్రంలో నటించలేదు.ఈ బ్యూటీ కూడా మంచి సింగర్.
పలు ఆల్బమ్స్ లో పాటలు పాడారు.