టాలీవుడ్ తమిళ గ్లామర్ బ్యూటీ అదా శర్మ.తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.తన అందంతో మరింత అభిమానులను పెంచుకుంది.అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.హిందీ, కన్నడ, తమిళం లో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది.
2008లో తొలిసారి హిందీలో ‘1920’ అనే హారర్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయింది.అదా శర్మ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.
అంతే కాకుండా ఈ సినిమా కు అవార్డు కూడా వచ్చింది.ఆ తరువాత వరుస సినిమాల్లో నటించి 2014 తెలుగు లో హీరో నితిన్ సరసన హార్ట్ అటాక్ సినిమాల్లో నటించి.
మంచి హిట్ ను సాధించుకుంది.ఇలా 12 సినిమాలలో నటించిన అదా శర్మ ప్రస్తుతం మరో సినిమాతో బిజీగా ఉంది.

ప్రసాద్ కడమ్ దర్శకత్వంలో వస్తున్న “చుహా బిల్లీ” అనే హిందీ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా గురించి కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.ఈ సినిమాలో అదా శర్మ పాత్ర కాసేపు పట్టరాని సంతోషంతో.ఆ తరువాత తెలియని దిగులుతో కనిపించనుంది.ఈ లక్షణం బైపోలార్ డిజార్డర్ సమస్య తో బాధ పడుతున్న అమ్మాయి గా అదా శర్మ కనిపించనుంది.ఈ విధంగా ఆమె మాట్లాడుతూ.” ఈ పాత్ర నాకు ఒక ఛాలెంజ్” అంటూ చెప్పుకొచ్చింది.“అంతేకాకుండా ఈ సినిమా చాలా డార్క్ కథాంశం.ఈ సినిమా పాత్రకు నేను విరుద్ధంగా ఉంటాను.కాబట్టే చేయాలనిపించింది.ఈ పాత్ర కోసం చాలా వర్క్ షాప్స్ చేస్తున్నాం.నేను చేసిన సినిమా లో ఇది భిన్నంగా ఉంది” అని అదా శర్మ తెలిపింది.