వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటు చేసుకున్న శిరీషా మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా యువతి కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు.
గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శిరీషా మృతి చెందిన తరువాత ఆమె ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్లినట్లు గుర్తించారు.అయితే గొడవ జరిగిన సమయంలో శిరీషా ఫోన్ లాక్కునట్లు ఆమె బావ విచారణలో వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో కాల్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు శిరీషా కేసుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది.
మూడు రోజుల్లో నివేదిక పంపాలని డీజీపీకి లేఖ రాసింది.