జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పీడ్ పెంచారు.ఏపీ ఎన్నికలతో పాటు, తెలంగాణ ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం ఏపీలో తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా ఏపీ అంతట పర్యటించేందుకు సిద్ధమవుతున్న పవన్, తెలంగాణలోనూ వారాహి ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జనసేన( Janasena ) అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనతో పవన్ ఉన్నారు.
టీడీపీ, జనసేన, బిజెపి పొత్తు ఖరారు కాబోతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ పొత్తు కొనసాగే అవకాశం ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారు.పొత్తులో భాగంగా జనసేనకు బలం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి తెలంగాణలోనూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు తెలంగాణలో 26 నియోజకవర్గాలకు ఇన్చార్జీలను పవన్ నియమించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన బలమైన శక్తిగా మారుతుందని పవన్ అంచనా వేస్తున్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం దాదాపు 1300 మంది ఆత్మ బలిదానాలు చేశారని, వాళ్ళ ఆకాంక్షలు ,నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందించకపోతే, ప్రత్యేక రాష్ట్రం సాధించి ప్రయోజనం ఏముంటుంది అని ప్రశ్నించారు.ఏపీ, తెలంగాణలో కలిసి డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారు.
అందుకే తెలంగాణలోనూ జనసేన వారాహి టూర్ ( Janasena Warahi Tour )ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.రాబోయే తెలంగాణ , ఏపీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దింపి, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలనే పట్టుదలతో జనసేన ఉంది.
దీనికి ఎలాగూ టిడిపి , బిజెపి మద్దతు ఉంటుంది కాబట్టి, తమకు తిరిగే ఉండదని అభిప్రాయంతో పవన్ ఉన్నారు.ఇక చేరికల పైన దృష్టి సారించారు.ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు .