కామారెడ్డి జిల్లాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రైతులు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధర్నాకు దిగారు.
ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.రైతులకు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్ధతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఆందోళనలతో జిల్లా అట్టుడుకుతోంది.కాగా ప్రస్తుతం కామారెడ్డిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంది.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిన్న కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనను అమానించారని తెలిపారు.మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు.కామారెడ్డిలోని రైతుల భూముల్లో ఇండస్ట్రీయల్ ప్రతిపాదన రద్దు చేయాలని పేర్కొన్నారు.
రైతులకు నష్టం కలిగించే మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.