అమెరికాలో ప్రతి రోజు ప్రతి క్షణం ఏదో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి.గత సంవత్సర కాలంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది.
ఎందుకంటే అమెరికాలో దాదాపు చాలామంది యువత దగ్గర తుపాకులు ఉండడం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా కాల్పులు చేసుకుంటూ ఉంటారు.ఈ కాల్పులలో ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతూ ఉంటారు.
అక్కడి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న ఈ కాల్పులు మాత్రం అస్సలు తగ్గడం లేదు.తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి.
ఊట ప్రావిన్స్ లో బుధవారం రాత్రి జరిగిన కాల్పులలో దాదాపు 8 మంది మరణించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.ఈ ఘటన ఎనొచ్ సిటీలోని ఒక ఇంట్లో జరిగినట్లు స్థానిక పోలీసులకు అక్కడి ప్రజలు సమాచారం అందించారు.
ఎవరు ఎలాంటి ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడి ఉంటారు అనేది పోలీసులకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు.పోలీసుల తనిఖీల సందర్భంగా మృతదేహాలు బయటపడ్డాయని ప్రభుత్వం మరియు అమెరికా మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.

మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉండడం బాధాకరమైన విషయం.చనిపోయిన వారంతా దాదాపు ఓకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వీరందరినీ ఎవరు కాల్చి చంపారు అనేది తెలుసుకునేందుకు ఉటా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.ఈ దర్యాప్తును వేగవంతం చేసి ఈ దుర్ఘటనకు ఎవరు పాల్పడ్డారో వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అమెరికా మీడియా సమావేశంలో వెల్లడించారు.
అక్కడి స్థానికులు ఒకే కుటుంబంలో ఇంత మంది చనిపోవడం బాధాకరమని చెబుతున్నారు.అక్కడి ప్రజలు దోషులకు కఠినమైన శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.







