ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అక్కడ ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని , ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూనే ఏపీలో అనేక కార్యక్రమాలకు జనసేన శ్రీకారం చుట్టింది.పూర్తిగా ఏపీ రాజకీయాలకే జనసేన పరిమితం అవుతుందని అంత భావిస్తుండగానే అకస్మాత్తుగా జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతుందనే విషయాన్ని ప్రకటించారు.ఇంతలోనే తెలంగాణ లో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.8 సీట్లను జనసేనకు బిజెపి కేటాయించింది.దీంతో పవన్( Pawan Kalyan ) ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒకవైపు బీజేపీ ( BJP )అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టడంతో పాటు , జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించి సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి పవన్ కు అత్యవసరంగా మారింది.
![Telugu Bjpjanasena, Janasenani, Pavan Kalyan, Telangana Bjp, Telangana-Politics Telugu Bjpjanasena, Janasenani, Pavan Kalyan, Telangana Bjp, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/janasenani-Pavan-Kalyan-BJP-Telangana-BJP-Telangana-government-Telangana-elections-BJP-janasena-alliance-Narendra-Modi.jpg)
తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) పవన్ పైన ప్రశంసలు కురిపించారు.దీంతో బిజెపి అగ్ర నేతల వద్ద ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే కచ్చితంగా జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాల్లోనూ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .అయితే ఈ ఎనిమిది స్థానాల్లో జనసేన బలంగా ఉందా అంటే.లేదని చెప్పుకోవాలి.
![Telugu Bjpjanasena, Janasenani, Pavan Kalyan, Telangana Bjp, Telangana-Politics Telugu Bjpjanasena, Janasenani, Pavan Kalyan, Telangana Bjp, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/Telangana-janasena-janasenani-Pavan-Kalyan-BJP-Telangana-BJP-Telangana-government-Telangana-elections-BJP-janasena-alliance-Narendra-Modi.jpg)
కూకట్ పల్లి నియోజకవర్గం పరవాలేదు అనిపించుకున్నా, మిగిలిన ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర ,వైరా, కొత్తగూడెం ,అశ్వరావుపేట, కోదాడ , నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అంతంత మాత్రమే అన్నట్టుగా పరిస్థితి ఉంది.ఇక్కడ జనసేనకు పెద్దగా క్యాడర్ లేకపోవడం వంటివి ఇబ్బందికరంగానే మారబోతున్నాయి.ఈ నియోజకవర్గంలో జనసేన గెలుపు అంత ఆషామాషి కాదనే విషయం తేలిపోతుంది.దీంతో పవన్ ఈ నియోజక వర్గాల పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, తమతో పొత్తు పెట్టుకున్న బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ఆ పార్టీ అభ్యర్థులు తరఫున పవన్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ ఫలితం సానుకూలంగా లేకపోతే , ఆ ప్రభావం జనసేన పై తీవ్రంగా ఉండడంతో పాటు ఏపీ ఎన్నికల పైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
.