తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒక పార్టీపై మరొక పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి.ఇక మీడియా, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం ను ఓరెత్తిస్తున్నాయి.
కచ్చితంగా అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రజలను ఆకట్టుకునే విధంగా రకరకాల హామీలు ఇస్తూ, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.తెలంగాణలో ఎన్నికల తంతు ఈ విధంగా ఉండగానే, ఏపీలోని రాజకీయ పార్టీలు తెలంగాణ ఎన్నికల పై మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.
ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ , టిడిపి, జనసేనలు తెలంగాణ ఎన్నికల్లో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన , తెలంగాణలో బిజెపితోనూ పొత్తు పెట్టుకుంది.
అక్కడ బిజెపితో పొత్తు లో భాగంగా కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.దీంతో బిజెపికి మద్దతుగా జనసేన ఎన్నికల ప్రచారంలోకి దిగింది.ఇక తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో టీడీపీ కి మేలు జరుగుతుంది అని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
కాంగ్రెస్ ను గెలిపించాలని ఉద్దేశంతోనే తెలంగాణలో టిడిపి పోటీకి దూరంగా ఉందని, ఆంధ్ర సెటిలర్స్ ఓట్లన్నీ కాంగ్రెస్ కు బదిలీ చేసే విధంగా టిడిపి ప్రయత్నిస్తోంది.అయితే అధికారికంగా కాంగ్రెస్ కు మద్దతు పలకపోయినా , కాంగ్రెస్ గెలిచే విధంగా టిడిపి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
![Telugu Brs Kcr, Chandrababu, Telangana, Ysrcp-Politics Telugu Brs Kcr, Chandrababu, Telangana, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/Telangana-Congress-BJP-BRS-kcr-Telangana-elections-Telangana-assembly-el.jpg)
ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించే ప్రయత్నాలు చేస్తుంది.2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ సహకారం అందించడంతో , ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.అందుకే తెలంగాణలోని వైసిపి మద్దతు దారులు అంతా అధికార పార్టీ బీఆర్ఎస్ ను గెలిపించే విధంగా ప్రయత్నించాలని ఇప్పటికే వైసిపి కొంతమంది కీలక నాయకుల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది.తెలంగాణలో తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో తమకు మేలు జరుగుతుంది అని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.