ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ తాజాగా ‘ ప్రకాశించని నవరత్నాలు – జగన్ మోసపు లీలలు’ పేరిట ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.ఈ సందర్భంగా ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 99 శాతం హామీలు అమలు చేశామన్న వైసీపీ ప్రచారం అవాస్తవమని ఆరోపించారు.
పది శాతం హామీలు మాత్రమే అమలు చేశారని చెప్పారు.వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.
రైతుభరోసా కింద 12 హామీలు ఇస్తే ఒక్కటీ కూడా అమలు కాలేదన్నారు.ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన ఎనిమిది హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు.