ఆమ్లెట్( Omelet ) అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.ఆమ్లెట్‌లో చాలా రకాలు ఉంటాయి.
బ్లడ్ ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్.ఇలా చాలా వెరైటీలు ఉంటాయి.ఏ ఆమ్లెట్ అయినా సరే ఎగ్ తప్పనిసరిగా ఉంటుంది.ఎగ్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.ఆమ్లెట్ ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది.కొంచెం కారం, ఉప్పు, ఉల్లిపాయలు కలిపి ఆమ్లెట్ వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
అందుకే ఆమ్లెట్ ను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.
అయితే ఆమ్లెట్ వేసేటప్పుడు ఎవరైనా నూనె ఉపయోగిస్తారు.కానీ బీర్( Beer ) తో ఆమ్లెట్ వేస్తే.బీర్ తో ఆమ్లెట్( Omelet with beer ) వేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.
అవును బీర్ తో ఆమ్లెట్ వేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో పెనంపై నూనెకు బదులు ఆమ్లెట్ వేయడానికి బీర్ ఉపయోగిస్తారు.
రోడ్డు పక్కన ఒక బండిపై బీర్ తో ఆమ్లెట్ వేస్తుండగా.దీనికి కొంతమంది గమనించి వీడియో తీశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో వేడిగా ఉన్న పెనం మీద బీరు పోసాక గుడ్డు సోన వేశాడు.
ఆ తర్వాత సోనను విస్తరించి దాని చుట్టూ ఆయిల్ బదులు బీర్ పోశాడు.
బీరులో ఆమ్లెట్ ఉడికిన తర్వాత ఆమ్లెట్ ను తిప్పేసి దానిని బుర్జీలాగా మాష్ చేశాడు.ఈ బీర్ ఆమ్లెట్ కొత్తగా ఉండటంతో చాలామంది టేస్ట్ చేస్తున్నారు.ఈ బండి దగ్గరికి చాలామంది క్యూ కట్టి ఈ స్పెషల్ ఆమ్లెట్ రుచి చూస్తున్నారు.
చాలామంది బీరు ప్రియులు లొట్టలేసుకుని దీనిని తింటున్నారు.బాగుదంటూ కుక్ కు కితాబిస్తున్నారు.