ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ లో ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల సమయంలో ఢిల్లీ లో ఒక మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం సృషించింది.
వివరాల్లోకి వెళితే….ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ పారిశ్రామికవాడలో ప్రీతి అహల్వాలియా అనే మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ గత రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళుతుంది.
అయితే ఈ క్రమంలో ఆమె వెనుకగా వచ్చిన ఒక యువకుడు తుపాకి తో కాల్పులు జరిపాడు.నడుచుకుంటూ వెళుతున్న ప్రీతి పై ఆ యువకుడు తుపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.
అయితే రెండు తూటాలు ఆమె శరీరంలోకి దూసుకెళ్లి ఛిద్రం చేయగా, మరోటి మాత్రం సమీపంలో ఉన్న కారు అద్దాలను తాకి ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్ స్పెక్టర్ ప్రీతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది.
అయితే ఈ విషయాన్నీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం వేట ప్రారంభించారు.అయితే ఒకపక్క ఎన్నికల హడావుడి మొదలవుతున్న కొద్దీ గంటల కు ముందు ఇలా ఒక మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ దారుణ హత్యకు గురికావడం పెద్ద సంచలనంగా మారింది.అయితే అసలు ఎందుకు ప్రీతి ని హతమార్చారు,దీని వెనుక కారణాలు ఏంటి అని కనుక్కొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు
.