స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.ఈ సినిమాతో బన్నీ పాత రికార్డులకు ఎసరు పెట్టి సరికొత్త రికార్డులను తన పేరుమీద రాసుకున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన టేకింగ్‌తో అదిరిపోయే సక్సె్స్‌ను అందుకున్నాడు.ఇక ఈ సినిమాతో నిర్మాతలు కూడా అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడమే కాకుండా భారీ లాభాలను గడించారు.
అల వైకుంఠపురములో చిత్రం అందించిన భారీ లాభాలతో చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారట.అల వైకుంఠపురములో సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు.
ఈ మేరకు దర్శకుడు త్రివిక్రమ్‌తో వారు సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.కాగా త్రివిక్రమ్ కూడా దీనికి ఓకే చెప్పాడట.
అటు బన్నీ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడట.
మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ప్రస్తుతం చిత్ర వర్గాలను సంతోష పెట్టే వార్తగా మారిపోయింది.
ఇక ఈ సినిమాను ఎప్పుడు తీస్తారా అనే అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉండిపోయింది.అటు బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.