భారత దేశంలో హొలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి .మనం ఈ పండుగను పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు పూసుకుని చాలా ఆనందాల మధ్య జరుపుకుంటాం.
అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ హొలీ పండుగను విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీరుస్తుంటారు ఇక్కడ వారి సంప్రదాయం.
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుళ్ళురు గ్రామం లో హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హొలీ పండుగ రోజు మగవాళ్ళు చీర కట్టుకొని ముస్తాబవుతారు .ఇది వారి తాత,ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం.అనుకున్న కోరికలు తీరితే మగ వారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి “రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంత కోడ్లూరు గ్రామం లో జరుగ నుంది.మగవారు మగువల చీరలు, ఆభరణాలు ధరించి హొలీ పండుగ సందర్బంగా వేద పండితులు ఆలయంకు మగవారు తమ కోరికలు తీర్చుకొడానికి స్త్రీ వేష దారిణిలో ఆలయానికి వచ్చి తమ మొక్కుబడులు చెలిస్తారు.
ఈ ఆచారం నిరక్షరాసులు పాటించాలనుకుంటే పొరబాటు.విద్యావంతుల సైతం తమ కోరికలు నెరవేర్చుకోనుటకు స్త్రీ వేషధారణ తో వచ్చి రతి మన్మమధుల కు మొక్కు బడులు చెల్లించు కున్నారు.భక్తులు తమ గ్రామ సుభిక్షం కొరకు వ్యవసాయం,ఉద్యోగ,వివిధ రంగాల్లో తమ కోరికలు నెరవేరలంటే మగవారు ఆడ వేష దారణలో చీర కట్టాల్సిందే.భక్తులు తమ అనుకున్న కోరికలు తీరిన తర్వాత చీర కట్టక పోతే అనిష్టం కలుగుతుందని వారి నమ్మకం ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.
పోలీసులు గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.