ఓట్స్.ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు ఖచ్చితంగా ఓట్స్‌ను తమ డైట్‌లో చేర్చు కుంటారు.అయితే ఓట్స్ మాత్రమే కాదు వాటితో తయారు చేసే పాలు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
అసలు ఓట్ మిల్క్ గురించి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే రోజు వాటినే తాగడానికి ప్రయత్నిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఓట్ మిల్క్ ఏయే బెనిఫిట్స్‌ను అందిస్తుందో చూసేయండి.
సాధారణంగా చాలా మందికి పాలు అంటే ఎలర్జీ ఉంటుంది.ఈ క్రమంలోనే పాలను దగ్గరకు కూడా రానివ్వరు.
అయితే అలాంటి వారు ఓట్ మిల్క్‌ను డైట్‌లో చేర్చుకోవచ్చు.వీటి వల్ల ఎలాంటి ఎలర్జీ ఉండదు.
పైగా ఓట్ మిల్క్‌లో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి.ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తాయి.
అలాగే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు మామూలు మిల్క్ కాకుండా ఓట్ మిల్క్‌ను తీసుకుంటే ఇంకా మంచిది.ఓట్ మిల్క్‌లో ఉండే కొన్ని ప్రత్యేక సుగుణాలు మరింత వేగంగా వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయ పడతాయి.
అంతే కాదు, ఓట్ మిల్క్‌ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.రోగ నిరోధక వ్యవస్థ శక్తి వంతంగా మారుతుంది.
చెడు కొలెస్ట్రాల్ కరిగి.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
మరియు జీర్ణ సమస్యలు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఇక ఓట్ మిల్క్ ను తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదు.రెండు కప్పుల రోల్డ్ ఓట్స్‌ను తీసుకుని నీటిలో అర గంట పాటు నాన బెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్‌లో నానబెట్టుకున్న ఓట్స్, ఐదు గ్లాసుల వాటర్ పోసి మెత్తగాగ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాటన్ క్లాత్ సాయంతో ఫిల్టర్ చేసుకుంటే ఓట్ మిల్క్ సిద్ధమైనట్టే.ఈ మిల్క్‌ను ఫ్రిడ్జ్‌లో మూడు రోజుల పాటు స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు.