'ఓజి' మూవీలో శ్రీయా రెడ్డి.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్!

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.పవన్ లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పాలి.

 Sriya Reddy Joins The Cast Of Pawan Kalyan Og Movie Details, Sriya Reddy, Direct-TeluguStop.com

ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.

రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు తాజాగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.ఇటీవలే యంగ్ నటుడు అర్జున్ దాస్ నటిస్తున్నట్టు ప్రకటించగా ఇప్పుడు వెర్సటైల్ నటి శ్రీయా రెడ్డి( Sriya Reddy ) నటిస్తున్నట్టు ప్రకటించారు.

విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీనే శ్రీయ రెడ్డి.

ఈ సినిమా ఇప్పటికి ఆడియెన్స్ కు బాగా గుర్తు ఉంది.ఈ భామ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే సలార్ సినిమాలో నటిస్తున్నట్టు ఈ మధ్య ప్రకటన రాగా ఇప్పుడు పవన్ ఓజిలో కూడా భాగం అయినట్టు తెలుస్తుంది.

చూడాలి అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో.

కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube