పెళ్లైన ప్రతి మహిళ గర్భం దాల్చాలని కోరుకుంటుంది.మహిళ గర్భం దాల్చడం ఆలస్యమైతే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉంటాయి.
సెలబ్రిటీలు అయితే ఈ ఒత్తిడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది.ఈ రీజన్ వల్లే కొంతమంది సెలబ్రిటీలు సరోగసి ( Surrogacy ) ద్వారా పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రముఖ బుల్లితెర నటి దెబీనా బొనర్జీ( Debina Bonnerjee ) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
ఐవీఎఫ్ విధానాన్ని( IVF ) ఎంచుకుని తల్లైన ఈ మహిళ తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
నేను వైద్యులను కలవగా వాళ్లు మొదట ఐయూఐ విధానాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారని ఇది హానికర ప్రక్రియ కాకపోవడంతో నేను వెంటనే ఆ ప్రక్రియకు అంగీకరించానని అయితే ఈ విధానం నాకు పని చేయలేదని ఆమె అన్నారు.ఐదుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రతిసారి ఫలితం నిరాశజనకంగా ఉండటంతో నేను ఆ తర్వాత ఐవీఎఫ్ విధానాన్ని ఎంచుకున్నానని నటి పేర్కొన్నారు.ఈ విధానంలో పిండాన్ని కడుపులో ప్రవేశపెట్టడానికి 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తారని ఆమె తెలిపారు.ఆస్పత్రిని బట్టి ధరలో మార్పులు ఉంటాయని ఐవీఎఫ్ ఎందుకని చాలామంది అడిగారని నటి పేర్కొన్నారు.బాధపడటం కంటే ప్రయత్నించడం మంచిది కదా అని ఆమె అన్నారు.

ఐదు సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత పాప పుట్టిందని దెబీనా పేర్కొన్నారు.తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ నటి తర్వాత రోజుల్లో బుల్లితెరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.వేర్వేరు కారణాల వల్ల ఈ నటి తన భర్తతో మూడుసార్లు పెళ్లి చేసుకోవడం గమనార్హం.అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగులో ఈ నటి సినీ ప్రస్థానం మొదలైంది.
దెబీనా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.