రైతుల సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనకు సిద్ధమవుతోంది.ఈ మేరకు ఈనెల 26న దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైతులు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు.
డిసెంబర్ 1 వ తేదీ నుంచి 11వరకు రాజ్ భవన్ ల దగ్గరకు ర్యాలీలు చేరుకోనున్నాయని సమాచారం.పెండింగ్ లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది.
అదేవిధంగా రైతుల ఉద్యమం కొనసాగింపుపై డిసెంబర్ 8 న కర్నార్ లో సమావేశం నిర్వహించనున్నారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నవంబర్ 19న ఫతే దివస్ గా జరుపుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.