మెగాస్టార్ చిరంజీవి గురించి సోషల్ మీడియా లో ఒక పుకారు తెగ షికారు చేస్తోంది.అదేంటి అంటే సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన నేపథ్యం లో ఆయన మృత దేహం వద్ద నివాళులు అర్పించేందుకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు.
అదే సమయం లో అక్కడికి వచ్చిన దర్శకుడు కొరటాల శివ ని చూసి మెగాస్టార్ చిరంజీవి మొహం తిప్పేసుకున్నారు.కొరటాల శివ నవ్వుతు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినా కూడా చిరంజీవి చూసి చూడనట్లుగా అక్కడ నుండి వెళ్లి పోయారు అంటూ ప్రచారం జరుగుతుంది.
ఇది ఎలా మొదలైందో కానీ మరీ నీచంగా ఉంది అంటూ మెగా ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇది పూర్తిగా అసంబద్దం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా చెబుతున్నారు.
అసలు ఆ సందర్భంలో ఇద్దరూ కూడా ఎదురు పడలేదు అనేది చాలా మంది మాట.కొందరు కావాలని మెగాస్టార్ చిరంజీవి పై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.మెగాస్టార్ మరీ అంత కురుచ మనస్తత్వం కలిగిన వాడు కాదని ఆయన సన్నిహితులు మాట్లాడుతున్నారు.ఆచార్య సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా నిరాశ పరచడం తో ఒకటి రెండు సందర్భాల్లో దర్శకుడు కొరటాల శివ పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఆ కారణంగానే ఇప్పుడు ఈ కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి.మరీ మొహం చూడనంత కోపం అయితే కొరటాల శివ పై మెగాస్టార్ చిరంజీవికి ఉండి ఉండదు.తప్పకుండా భవిష్యత్తులో ఇద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు.చిరంజీవి మంచి వారికి ప్రతిభ ఉన్న వారికి ప్రోత్సాహాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉంటాడు.
కనుక కొరటాల శివ మరో సారి సక్సెస్ అయ్యి తనను తాను నిరూపించుకుంటే తప్పకుండా అవకాశం ఇస్తాడని మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.అంతే తప్ప మొహం చూపించకుండా తిప్పుకోవడం అనేది చిరంజీవి చేయరు.







