సాధారణంగా ఎవరికైనా చిన్న సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మనశ్శాంతి ఉండదు.కొన్ని సందర్భాల్లో సమస్య సులువుగానే పరిష్కారమైతే మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఆ సమస్యలు పరిష్కారం కావు.
అయితే మహేష్ బాబుకు మాత్రం ఈ ఏడాది ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి.వరుస విషాదాలు మహేష్ బాబును ఎంతగానో బాధ పెడుతున్నాయి.
మహేష్ కు ఎదురవుతున్న కష్టాలను తలచుకుని ఆయన అభిమానులు సైతం కంటతడి పెడుతున్నారు.ప్రస్తుతం మహేష్ బాబుకు ఉన్న ఏకైక ధైర్యం కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ ఈ స్థాయిలో సక్సెస్ కావడంలో ఆది శేషగిరిరావు పాత్ర ఎంతో ఉంది.ఆది శేషగిరిరావు ఇచ్చిన మాటను సైతం కృష్ణగారు తప్పనిసరిగా పాటించేవారని సమాచారం.
ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబానికి ఆది శేషగిరిరావు సపోర్ట్ ఎంతగానో అవసరమని చెప్పవచ్చు.

మహేష్ బాబుకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం ఆది శేషగిరిరావు గారిపై ఉంది.మహేష్ బాబుకు అన్ని విషయాల గురించి సరైన అవగాహన ఉంది.అయితే మహేష్ కెరీర్ పరంగా బిజీగా ఉంటారు కాబట్టి ఆది శేషగిరిరావు మహేష్ తో కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
మరోవైపు నాన్నపై ప్రేమతో కృష్ణ మెమోరియల్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం.
ఇప్పటివరకు టాలీవుడ్ సినీ హీరోలలో ఏ హీరోకు కూడా ఇలా మెమోరియల్ ఏర్పాటు చేయడం జరగలేదు.
కృష్ణ భౌతికంగా దూరమైనా తమ హృదయాల్లో మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటారని మరి కొందరు కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.మరోవైపు మహేశ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
మహేష్ కొన్ని వారాల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం.







