తెలంగాణలో వివిధ శాఖలో భారీగా అవినీతి అక్రమాలు పేరుకుపోయాయనే విషయాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) గుర్తించారు.అందుకే అధికారం చేపట్టిన మొదట్లోనే ఆయా శాఖలలో భారీ ప్రక్షాళన చేపట్టి పారదర్శకంగా పరిపాలన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు చర్యలకు దిగుతున్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా ఆరోపణలు ఎదుర్కొని, పేపర్ లీకేజీ ఘటనతో అప్రతిష్ట మూటగటుకున్న టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు .ఈ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యుపిఎస్సి తోపాటు , ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల( Public Service Commissions ) పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా, దీనిపై నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా హైదరాబాద్ లోని సచివాలయంలో టిఎస్పిఎస్సి( TSPSC ) ద్వారా నియామకాలు నోటిఫికేషన్ కు సంబంధించిన అంశాలపై అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి , డీజీపీ రవి గుప్తా , అడిషనల్ డీజీ సివి ఆనంద్ , టిఎస్పిఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ ఆర్థిక శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా టిఎస్పిఎస్సి ప్రక్షాళన అంశంపై రేవంత్ మాట్లాడారు.ఇకపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకత్వం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాలకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకత్వం అనుగుణంగా పారదర్శకంగా ఉండే విధంగా మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.
అలాగే టిఎస్పిఎస్సి కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని , కావలసిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే సమకూర్చుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇదిలా ఉంటే టీఎస్పీఎస్సీ పాలకమండలి సభ్యులు లింగారెడ్డి , కోట్ల అరుణ కుమారి , సుమిత్ర ఆనంద్ ,కారం రవీంద్రరెడ్డి ఈరోజు రాజీనామా చేయనున్నారు.ప్రస్తుతం గవర్నర్ తమిళసై పుదుచ్చేరి పర్యటనలు ఉన్నారు.
ఈరోజు ఆమె హైదరాబాద్ కు వస్తారు ? ఆమె వచ్చిన తర్వాత రాజు భవన్ కు వెళ్లి టీఎస్పీఎస్సీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పిస్తారు.ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సోమవారం రాజీనామా గవర్నర్ తమిళసై ఆ రాజీనామాను ఆమోదించలేదు.
ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులు ఎవరో తేలకుండా నిరుద్యోగులకు న్యాయం జరగకుండానే రాజీనామాను ఎలా ఆమోదించాలని ఆమె ప్రశ్నించారు.సిఎస్ కు లేఖ రాసి కొత్త ప్రభుత్వ అభిప్రాయాలను, న్యాయ నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు.