పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు చుక్కలు చూపిస్తున్నాయి.ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న అనేక నిర్ణయాలకు ప్రజలలో వ్యతిరేకత వస్తూ ఉండటంతో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.
ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.దీంతో ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో ఓటింగ్ ఈనెల 28 నుండి 30 వ తారీఖు వరకు చర్చ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కేవలం ప్రతిపక్షాల కంటే 7 సీట్లు మెజారిటీతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.దీంతో పాకిస్థాన్ దేశం సంక్షోభంలో ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ కి ఇలాహి తాజాగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామ్య పక్షాలను నేరుగా సంప్రదించి.సంకీర్ణ ప్రభుత్వం లోనే కొనసాగించాలా లేదా అనేది ఆయనే తుది నిర్ణయం తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 100% సంక్షోభంలో ఉందని ఇలాహి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇక ఇదే టైంలో ఇటీవల సోషల్ మీడియాలో ఉర్దూ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ అనేక తప్పులు పలకటంతో.పాకిస్థానీయులు ఆయన్ని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.
పాకిస్థాన్ ప్రజలు ఎక్కువగా ఉర్దూ భాషను అమితంగా ప్రేమించే మనుషులు కావడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై భారీగా సెటైర్లు వేస్తున్నారు.