తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది.
ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో నాలుగు అమలు చేస్తూ ఉండగా మరో రెండు గ్యారెంటీలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) శ్రీకారం చుట్టారు.వారం రోజులలో ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఈ పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది.
ఈ క్రమంలో 5 వేల కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.కొడంగల్ లో( Kodangal ) అనేక విద్యాసంస్థలకు కూడా శంకుస్థాపన కార్యక్రమలు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.( Minister Komatireddy Venkatareddy ) బీఆర్ఎస్ పై మండిపడ్డారు.కాలేశ్వరం పేరుతో మూడేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు అని ఆరోపించారు.రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్( KCR ) ఇంట్లోనే ఉన్నారు.
మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్డు పనులు నిలిచిపోయాయి.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టారు.ఇప్పటికే 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు.
మూసీనది ప్రక్షాళన చేస్తున్నరు.సిగ్గు లేకుండా జలయాత్ర పేరుతో కేసీఆర్ మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నారు.
అని మంత్రి కోమటిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.