కెనడా: రోడ్డు ప్రమాదంలో కబళించిన మృత్యువు.. కుమారుడి భౌతికకాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

కెనడాలోని ఒంటారియోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.ఈ ఘటన ఇరు దేశాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.

 Road Mishap In Canada: Batala Family Awaits Son's Body, Road Accident , Canda ,-TeluguStop.com

ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారనుకున్న తమ బిడ్డలను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఈ క్రమంలో అసలు ప్రమాదం ఎలా జరిగింది.

దీనికి దారి తీసిన పరిస్ధితులపై కెనడా పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు తమ బిడ్డలను కడసారి చూసుకునేందుకు భారత్‌లోని మృతుల తల్లిదండ్రులు నిరీక్షిస్తున్నారు.

కరణ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి కుటుంబం వీరిలో ఒకటి.అతని మృతదేహం పంజాబ్‌లోని అమ్మోనంగల్ గ్రామానికి ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని కుటుంబ సభ్యులు అంటున్నారు.కరణ్‌పాల్ తండ్రి హర్జిత్ సింగ్ రైతు.బారింగ్ యూనియన్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరణ్‌ను తదుపరి ఉన్నత చదువుల కోసం కెనడాకు పంపారు.

ఇందుకోసం హర్జిత్ చాలా డబ్బు ఖర్చు పెట్టాడు.

కెనడా యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో చేరిన అతను కోవిడ్ కారణంగా ఏడాది పొడవునా ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరయ్యాడు.గతేడాది జనవరి 26న కోర్సు పూర్తి చేసేందుకు కెనడాకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.హర్జీత్ సింగ్ మాట్లాడుతూ.

కరణ్‌‌పాల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించాడని.ప్రభుత్వం కనుక ఉద్యోగం ఇచ్చి వున్నట్లయితే కెనడా వెళ్లేవాడు కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఘోర ప్రమాదంతో కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ క్రమంలో బాధితుల కుటుంబ సభ్యులకు అండగా నిలిచింది.

మాంట్రియల్‌కు చెందిన కెనడా ఇండియన్ గ్లోబల్ ఫోరమ్ జాతీయాధ్యక్షుడు డాక్టర్ శివేంద్ర ద్వివేది మాట్లాడుతూ.ఎలాంటి సహాయం అవసరమైనా అందుబాటులో వుంటామని చెప్పారు.

అంత్యక్రియలకు లేదా ఆర్దికంగానూ సహాయం చేస్తామని శివేంద్ర వెల్లడించారు.టొరంటోలోని భారత కాన్సులేట్ కార్యాలయం సైతం కెనడియన్ అధికారులు, బాధిత భారతీయ కుటుంబాలతో సమన్వయం చేయడానికి ఒక బృందాన్ని నియమించింది.

Road Mishap In Canada: Batala Family Awaits Sons Body

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube