ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం గురించి విపరీతమైన చర్చ సాగుతోంది.అదే ఆఫ్ఘనిస్తాన్.
ఇక్కడ తాలిబన్లు అధికారంలోకి రావడంతో వారి అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.వారి రాక్షస పాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం.
తినడానికి తిండి కూడా దొరకనంత పేదరికంలోకి ప్రజలు వెళ్లిపోయారు.అత్యంత దారుణ మైన పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు.
ఇంకొందరు అయితే ఆకలికి తట్టుకోలేక చనిపోతున్నారు కూడా.ఆఫ్ఘనిస్తాన్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా సాయాలు అందట్లేదు.
దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని వెంటాడుతోంది.నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నిఅంటడంతో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా ఆడపిల్లల బతుకుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎలాగూ ఆడ పిల్లలను ఎదగనీయకుండా ఆంక్షలు పెడుతున్నారు కాబట్టి వారిని తమతో ఉంచుకున్న పెద్దగా ప్రయోజనం లేదని చాలామంది పేద తల్లిదండ్రులు చిన్నారులను అమ్మేసుకుంటున్నారు.
ఇప్పుడు బద్ఘిస్ ప్రావీన్స్ లో నివసించే అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి ఇదే దారునానికి పాల్పడ్డాడు.
![Telugu Adbul Malik, Afghanistan, Afghanisthan, Child, Parvan Malik, Poverty, Tal Telugu Adbul Malik, Afghanistan, Afghanisthan, Child, Parvan Malik, Poverty, Tal](https://telugustop.com/wp-content/uploads/2021/11/Nine-year-old-girl-marries-55-year-old-man-in-Taliban-afghanisthan-detailsa.jpg )
సరిగ్గా రెండు నెలల కిందట 12 ఏళ్ల పెద్ద కుమార్తెను డబ్బుల కోసం తాకట్టు పెట్టిన అతను ఇప్పుడు రెండో కూతురును అమ్మేసేందుకు సిద్ధపడ్డాడు.తొమ్మిదేండ్ల చిన్న కూతురును ఏకంగా 55 ఏండ్లు ఉన్న వృద్ధుడికి ఇచ్చి పెండ్లి చేసేందుకు నిర్ణయించాడు.అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే తనకు వేరే అవకాశం లేదని వాపోయాడు.
బాగా చదవి టీచర్ గా స్థిరపడాలనుకున్న తొమ్మిదేళ్ల పర్వాన్ మాలిక్ ఇప్పుడు బానిసగా మారిపోయింది.కాగా తన కూతురును ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని, ముఖ్యంగా కొట్టొద్దని ఆ తండ్రి మాట తీసుకున్నాడు.
ఈ వార్త అందరినీ కలిచి వేస్తోంది.ప్రపంచాన్ని ఈ వార్త ఇప్పుడు కలవర పెడుతోంది.
ఇంకెన్ని దారుణాలు చోటుచేసుకుంటాయో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.