ఈ మధ్య కాలంలో అమ్మాయిలు మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.అంతలా మేకప్‌కు ఎడిక్ట్ అయిపోయారు.
ఏ పార్టీకో, ఫంక్షన్‌కో మేకప్ వేసుకునే వారు కొందరు ఉంటే.రెగ్యులర్‌గా వేసుకునే వారు కూడా ఎందరో ఉంటారు.
అయితే మేకప్ వేసుకోవడం గురించి పక్కన పెడితే.దాన్ని తొలిగించుకునేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల కెమికల్ రిమూవర్లను యూజ్ చేస్తుంటారు.
అప్పుడప్పుడు వాటితే వీటి వల్ల పెద్ద సమస్య ఉండకపోవచ్చు.కానీ, రెగ్యులర్‌గా మేకప్‌ని తొలిగించడానికి కెమికల్స్ ఉండే రిమూవర్లను వాడితే మాత్రం చర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.
అందుకే సహజసిద్ధమైన పద్ధతుల్లో మేకప్‌ను రిమూవ్ చేసుకోవాలి.మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
![Telugu Tips, Latest, Removers, Skin Care, Skin Care Tips-Telugu Health - తె Telugu Tips, Latest, Removers, Skin Care, Skin Care Tips-Telugu Health - తె](https://telugustop.com/wp-content/uploads/2021/08/natural-makeup-removers-makeup-removers-makeup-latest-news-skin-care-skin-ca.jpg )
కలబంద మేకప్‌ను న్యాచురల్‌గా తొలిగించగలదు.ఇందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కలబంద జెల్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో కాటన్ బాల్‌ను డిప్ చేసి మేకర్‌ను రిమూవ్ చేసుకోవాలి.అనంతరం వాటర్‌తో పేస్ వాష్ చేసుకుంటే మేకప్ పూర్తిగా పోతుంది.
అలాగే ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఆల్మండ్ ఆయిల్, ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సాయంతో ముఖం మొత్తానికి అప్లై చేసి సర్కిలర్ మోషన్‌లో రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా రుద్దుకోవాలి.
అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మేకప్ ఇట్టే పోతుంది.
![Telugu Tips, Latest, Removers, Skin Care, Skin Care Tips-Telugu Health - తె Telugu Tips, Latest, Removers, Skin Care, Skin Care Tips-Telugu Health - తె](https://telugustop.com/wp-content/uploads/2021/08/natural-makeup-removers-makeup-removers-makeup-latest-news-skin-care-sk.jpg )
ఇక మరొర న్యాచురల్ మేకప్ రిమూవర్ ఏంటంటే.ఒక కాటన్ బాల్ లేదా తడిపిన కాటన్ క్లాత్‌పై కాస్త కొబ్బరి నూనెను వేసి, దానితో ముఖంపై మసాజ్ చేసినట్లుగా మృదువుగా మూడు నిమిషాల పాటు రుద్దుకోవాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.