మెగాస్టార్ రాకపై సూపర్ స్టార్ మహేష్ బాబు హాట్ కామెంట్స్! ఎదురుచూస్తున్నాం...

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సరిలేరు నీకెవ్వరు.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత మరల తెరపై కనిపిస్తుంది.

 Megastar Chiranjeevi As Chief Guest For Sarileru Neekevvaru-TeluguStop.com

ఇక ఇందులో ఒకప్పటి హీరోయిన్ సంగీత కూడా కీలక పాత్రలో కనిపిస్తుంది.సంక్రాంతి 11న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాకి సంబందించిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే జనవరి 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎల్బీ స్టేడియంలో చాలా గ్రాండ్ గా చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని గెస్ట్ రాబోతున్నారు.

ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చూడని మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ ఈవెంట్ లో ఒకే వేదిక మీద చూడబోతున్నాం.దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి రావడానికి అంగీకరించాడు.

దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు అఫీషియల్ గా ట్వీట్ చేసి కన్ఫర్మ్ చేశారు.మేము పిలవగానే సహృదయంతో రావడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.

మా వేడుకల్లో పాలుపంచుకోవడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మా టీమ్ మొత్తం మీ రాక కోసం ఎదురుచూస్తుంది అని పోస్ట్ పెట్టారు.

దీంతో చిరంజీవి రాక కన్ఫర్మ్ అయ్యింది.మరి ఒకే స్టేజ్ మీద అటు మెగాస్టార్, ఇటు సూపర్ స్టార్, మరో వైపు లేడీ సూపర్ స్టార్ ని చూడబోతున్న తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube