ఏపీకి మూడు రాజధానులు అని జగన్ చెప్పిన మాటని సమర్ధిస్తూ ఈ రోజు జి ఎన్ రావు కమిటీ కూడా నివేదిక ఇచ్చింది.దీంతో అమరావతి, విశాఖ, కర్నూలు ఉన్న కూడా మిగిలిన రెండు కేవలం నామమాత్రంగా ఉండగా అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా విశాఖ మారబోతుంది.
అంటే పరిపాలన మొత్తం విశాఖ కేంద్రంగానే సాగుతుంది.ఏదో అసెంబ్లీ సమావేశాలకి మాత్రమే అమరావతి రాజధానిగా ఉంటుంది.
రాజధానిని అధికారికంగా విశాఖని కన్ఫర్మ్ చేయకపోయినా ఇప్పటికే విశాఖ కేంద్రంగా జగన్ తన ప్లాన్ ని అమలు చేసినట్లు తెలుస్తుంది.అందులో భాగంగానే విశాఖలో భూ సమీకరణ కోసం కొత్తగా వేణుగోపాల రెడ్డి అనే జేసీని నియమించడం జరిగినట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు.
ప్రస్తుతం ఏపీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ అంటే, అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టె నగరం విశాఖ అనే విషయం అందరికి తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే జగన్ విశాఖని తన అడ్డాగా మార్చుకోవాలని ఎన్నికలకి ముందే డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం.ఆ దిశగా అడుగులు వేసేందుకు విశాఖలో రాజకీయ బాద్యతలని విజయసాయి రెడ్డికి అప్పగించి అక్కడ వ్యవహారం అంతా చక్కబెట్టినట్లు తెలుస్తుంది.
ఇదంతా ఇన్ సైడ్ గా జరిగిందని సమాచారం.ఇక తనకి అనుకూలమైన బ్యాచ్ అందరిని విశాఖకి తరలించి అక్కడ అధికారికంగా భూములసేకరణ మీద దృష్టి పెట్టి ఇప్పటికే దేవాదాయ భూములతో పాటు, అటవీ భూములని కూడా లెక్కించి పరిశీలనలో పెట్టినట్లు విశాఖలో వినిపిస్తుంది.
అయితే ఈ విషయం అధికారికంగా జరగడంతో ఇంత కాలం ఎవరు పట్టించుకోకున్నా ఇప్పుడు రాజధాని ప్రకటన తర్వాత జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ అంతా బయటపడుతుందని రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.ఏపీ రాజధానిగా విశాఖ ఉంటే ఉత్తరాంద్ర ప్రజలు సంతోషించే విషయమే అయిన, ప్రశాంతతకి మారు పేరైన ఈ ప్రాంతంలో పులివెందుల రాజకీయం మొదలైతే పరిణామాలు ఎలా మారుతాయో అని భయం కూడా అక్కడి ప్రజలలో ఉంది.