తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి.
ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ అందులో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి.కాగా ఇటీవల ఈమె అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 ( Hit 2 )మూవీలో నటించింది.
ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించగా శైలేష్ కొలను మూవీకి దర్శకత్వం వహించారు.మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా సీక్వెల్‌లో అడవి శేష్ నటించారు.
ఇక ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు, త్రివిక్రమ్ ( Mahesh Babu, Trivikram )దర్శకత్వంలో వస్తోన్న గుంటూరు కారంలో ( Guntur karam )సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది.ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు.అంతేకాదు కొన్ని రోజుల పాటు షూట్ కూడా చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఇక పూజా స్థానంలో శ్రీలీల చేరగా సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి చేస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది.
వరుణ్ తేజ్ ( Varun Tej )హీరోగా నటించబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంఢీవధారి అర్జున ( Gandhivadhari Arjuna )అనే ఒక సినిమా చేస్తున్నారు.ఈ సినిమాతో పాటు ఆయన పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమా ఈ నెల27న గ్రాండ్‌గా లాంఛ్ కానుందని తెలుస్తోంది.అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఫైనల్ అయ్యినట్లు తెలుస్తోంది.విశాఖపట్నం నేపథ్యంలో 1960లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వస్తోందట.
మొత్తానికి మీనాక్షి చౌదరికి తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.ప్రస్తుతం మీనాక్షి చౌదరి నటిస్తున్న సినిమాలు గనుక హిట్ అయితే ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరిన్ని అవకాశాలు వచ్చి చేరతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.