'గుంటూరు కారం' స్టోరీ లీక్.. సిస్టర్స్ మధ్యలో కోల్డ్ వార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) సర్కారు వారి పాట వంటి హిట్ తర్వాత మరో సినిమా పూర్తి చేయలేదు.అయితే ఈ సినిమా పూర్తి కాక ముందే త్రివిక్రమ్ తో సినిమా ప్రకటించాడు.

 Mahesh Babu Guntur Karam Movie Latest Update Details, Guntur Karam, Mahesh Babu,-TeluguStop.com

కానీ ఈ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య ఈ ఏడాది జనవరిలో స్టార్ట్ అయ్యింది.ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ అయితే పూర్తి చేసుకుంది.

కానీ మళ్ళీ సమ్మర్ ముందు వాయిదా పడింది.

మళ్ళీ ఇటీవలే షూట్ స్టార్ చేసుకుని ఒక నెల షూట్ జరగగానే మళ్ళీ కొద్దిగా విరామం తీసుకున్నారు.‘గుంటూరు కారం’ను( Guntur Karam Movie ) మాస్ మసాలా గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా గురించి ఎప్పుడు ఏదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా నెట్టింట ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో శ్రీలీల,( Sreeleela ) మీనాక్షి చౌదరి( Meenakshi Chowdary ) హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.మరి ఈ ఇద్దరు ఈ సినిమాలో సిస్టర్స్ గా నటిస్తున్నారని.కాకపోతే వీరికి తండ్రి ఒక్కరేనని కానీ తల్లులు మాత్రం వేరని.

ఈ క్రమంలోనే ఇద్దరు హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాక్.అంతేకాదు ఇద్దరి మధ్య మహేష్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట.

గుంటూరు మిర్చి యార్డ్ లో కథ నడుస్తుందని అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా బలంగా చూపించ బోతున్నారు అని తెలుస్తుంది.ఈ స్టోరీ లీక్ ఇప్పుడు సినిమాపై మరింత హైప్ పెంచుతుంది.కాగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube