మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.
ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ‘ సినిమా రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది.
ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ సినిమా చేస్తున్నాడు.ఇక వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర‘ సినిమాను చేస్తున్నాడు.
ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.
![Telugu Bobby, Chiranjeevi, Dhamaka, Khiladi, Ravanasura, Ravi Teja, Sudheer Varm Telugu Bobby, Chiranjeevi, Dhamaka, Khiladi, Ravanasura, Ravi Teja, Sudheer Varm](https://telugustop.com/wp-content/uploads/2022/04/chiranjeevi-khiladi-dhamaka-ravanasura-Trinathrao-ankkina.jpg)
ఇన్ని సినిమాలు చేస్తూనే మాస్ రాజా తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈయన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇచ్చాడు.ఈయన కేరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈయన ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం గా నిలిచాడు.
ప్రెసెంట్ ఐదు సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఈయన అనూహ్య నిర్ణయం అభిమానులను కలవర పెడుతుంది.
![Telugu Bobby, Chiranjeevi, Dhamaka, Khiladi, Ravanasura, Ravi Teja, Sudheer Varm Telugu Bobby, Chiranjeevi, Dhamaka, Khiladi, Ravanasura, Ravi Teja, Sudheer Varm](https://telugustop.com/wp-content/uploads/2022/04/khiladi-dhamaka-ravanasura-Trinathrao-ankkina.jpg)
హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈయన సపోర్టింగ్ రోల్స్ కు కూడా ఓకే చెబుతున్నాడని టాక్ వినిపిస్తుంది.స్టార్ హీరోగానే కాకుండా మరొక స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలు చేయదనాయికి కూడా రెడీ అవుతున్నాడట.కథ నచ్చితే ఏ స్టార్ హీరో సినిమాలో అయినా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని డైరెక్టర్ లకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రెసెంట్ ఈయన చిరంజీవి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో తన పాత్రకు భారీగానే పారితోషికం అందుకుంటున్నాడట.