జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ జంట ఒకటి.వీరిద్దరూ కలిసి ఒకే స్కిట్లలలో చేయటంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నామంటూ జబర్దస్త్ వేదికగా అందరికీ తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు.
ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లికి కూడా పెద్దలు ఒప్పుకున్న తర్వాతే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.వీరి ప్రేమ గురించి తెలియజేసిన అనంతరం వీరిద్దరూ కలిసి ఎన్నో వెకేషన్ లకు వెళ్లి ఎంజాయ్ చేశారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ ప్రేమ ప్రయాణం గమ్యానికి చేరింది అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో ద్వారా రాకింగ్ రాకేష్ తో తనకు ఏర్పడిన పరిచయం ఆ పరిచయం ప్రేమగా ఎలా మారిందనే విషయాలన్నింటి గురించి కూడా తెలియజేశారు.ఇలా వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తెలియజేశారు.
ఇక నేడు సుజాత రాకేష్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.ఈ క్రమంలోనే తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు యాంకర్ రవి అనసూయ మంత్రి రోజా హాజరయ్యారు.
ప్రస్తుతం జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.త్వరలోనే వీరి పెళ్లి తేదీ కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.