దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇద్దరు నిందితుల ఈడీ కస్టడీ ముగిసింది.బోయిన్ పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లను ఐదు రోజుల పాటు అధికారులు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు వారిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.ఈ క్రమంలో అభిషేక్, విజయ్ నాయర్ ల కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.