Balakrishna Nayanthara: బాలయ్య బాబు సినిమాకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ అగ్ర హీరో బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.

 Senior Actress Nayanthara Demands Shocking Remuneration For Nbk Upcoming Movie D-TeluguStop.com

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ తో పాటు పోస్టర్స్ కి కూడా భారీగా రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది అన్న నమ్మకంతో బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు.

అంతేకాకుండా బాలయ్య బాబు కెరియర్ లో ఈ సినిమా మరొక బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా ఉండబోతుంది అని తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాను చేయబోతున్నట్టుగా ఇప్పటికీ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది.

ఇప్పటికే ఈ సినిమాలో నటించడం కోసం కొంతమంది నటీనటులను కూడా ఫైనల్ చేసేశారు.కాగా ఇందులో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల కూడా ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో దర్శకనిర్మాతలు మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీకి రాలేదని తెలుస్తోంది.

Telugu Anil Ravipudi, Balakrishna, Balakrishnaanil, Nayanatara, Nayanthara, Sri

ఇదివరకు ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతోంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఆ విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం నయనతార ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం నయనతార ఈ సినిమా కోసం దాదాపు 8 నుంచి 9 కోట్ల మధ్యలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట.మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube