పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ హిట్ గా నిలిచి అందరికీ లాభాలను అందిస్తుందని అందరూ భావించగా ఈ సినిమా మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుని అందరికీ షాక్ ఇచ్చింది.ఈ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఛార్మి విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అయితే కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ మాట్లాడుతూ లైగర్ సినిమాకు సంబంధించి ఫిర్యాదు చేసింది తానేనని చెప్పుకొచ్చారు.
ఈ ప్రాజెక్ట్ లో కేసీఆర్ కూతురు కవిత పెట్టుబడులు పెట్టారని నేను ఫిర్యాదు చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
ఈడీ దగ్గర ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని అందువల్లే పూరీ జగన్నాథ్ ఛార్మీలను విచారణకు పిలిపించారని ఆయన కామెంట్లు చేశారు.పూరీ ఛార్మీ చెప్పిన లెక్కలు సరిగ్గా ఉంటే గంటలో విచారణ పూర్తయ్యేదని ఎక్కువ సమయం విచారణ జరిగిందంటే వాళ్లు వాస్తవాలు చెప్పలేకపోయారని అర్థమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.
2017 సంవత్సరంలో ఒక కేసులో కొంతమంది సినిమా వాళ్లను పిలిపించారని ఇప్పుడు ఆ కేసు సైలెంట్ అయిపోయిందని బక్కా జాడ్సన్ అన్నారు.

తెలుగులో ఆరుగురు హీరోలకు మాత్రమే పాన్ ఇండియా క్రేజ్ ఉందని విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా తీయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.విజయ్ సినిమాలకు ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో తెలియదా అంటూ బక్కా జాడ్సన్ కామెంట్లు చేశారు.

లైగర్ ఫ్లాప్ దెబ్బతో పూరీ జగన్నాథ్ కు ప్రస్తుతం కొత్త సినిమా ఆఫర్లు దక్కడం లేదు.పూరీ జగన్నాథ్ పేరు వింటే స్టార్ హీరోలు భయపడే పరిస్థితి ఉందని సమాచారం అందుతోంది.లైగర్ సినిమాకు సంబంధించి అనేక వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో చూడాలి.







