మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.రెండో రోజు పర్యటనలో భాగంగా పండర్ పూర్ లోని విఠల్ రుక్మిణి దేవీ ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్రలో వరుస పర్యటనలు చేస్తున్నారు.
సోలాపూర్ ధారసౌ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సర్కోలి గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.కాగా ఈ సభలో బీఆర్ఎస్ పార్టీలోకి అక్కడి ముఖ్యనేతల చేరికలు ఉండనున్నాయి.
సభ అనంతరం తిరుగు పయనంకానున్న కేసీఆర్ మార్గమధ్యలో ఉన్న తుల్జాభవానీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు.