సహజంగానే రాజకీయాల్లో గోడ మీద పిల్లలు ఎక్కువ ఉంటారు.అవసరం కోసం అవకాశాల కోసం పార్టీలు మారటం రాజకీయాల్లో మామూలుగా పోయి చాలా కాలం అయింది.
ప్రజలకు సేవ చేయడానికి కాక వ్యాపార అభివృద్ధి కోసం పేరు ప్రఖ్యాతల కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు ఎక్కువైపోయారు.దాంతో ఒక చోట అవకాశం లేకపోతే గోడ దూకి మరొక చోట వెతుక్కోవటం రాజకీయ నాయకులు సర్వసాధారణమే .పార్టీలు కూడా వారిచ్చేఫండ్ ల మీద ఆధారపడి టికెట్లు కేటాయించే రోజులు వచ్చాయి.అయితే అలాంటి వారికి తన పార్టీలో ఛాన్స్ లేదని తేల్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
( Pawan Kalyan ) 2019 ఎన్నికల్లో ముందు వైసీపీ నుంచి వచ్చిన రాజోలు ఎమ్మెల్యే కు టికెట్ ఇచ్చి భంగపడ్డ జనసేన( Janasena ) మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదనిబలంగా కోరుకుంటుంది
2019లో జనసేన టికెట్ పై పోటీ చేసిన కొంతమంది ఇప్పుడు రాజకీయాలు ఆక్టివ్ గా లేరు.కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు.
అట్లాంటి వారందరికీ పవన్ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది .ఎవరైతే పార్టీని అంటిపెట్టుకొని ఓపిక గా పని చేస్తున్నారో అటువంటి వారికే టికెట్లు ఉంటాయని, భవిష్యత్తు కోసం కొత్త తరం నాయకులను తయారు చేస్తానని అంతే తప్ప వేరే పార్టీలో టికెట్లు దక్కక ఆకరి సమయం లో జనసేన డోర్ తట్టేవారికి తలుపులు తెరిచి లేవని ఆయన చెప్పినట్లుగా సమాచారం.నరసాపురం వారాహి యాత్రలో( Varahi Yatra ) భాగంగా జనసేన కార్యకర్తలతో మాట్లాడిన పవన్ చాలా విషయాలను చెప్పుకొచ్చారట.
రాజకీయాల్లో కమిట్మెంట్ చాలా ముఖ్యమని గెలుపోటములు శాశ్వతం కాదని, ప్రజల కోసం ఓపికగా దీర్ఘకాలం పనిచేయాలనుకుంటున్న వారే తనతో ఉండాలని ఆయన కోరినట్లుగా తెలుస్తుంది.దాంతో వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి లోను, జనసెన – తెలుగుదేశం పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు జనసేన రూట్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చు అని ఆశపడుతున్న వారికి పవన్ నిర్ణయం శరాఘాతమయ్యే అవకాశం ఉంది.ఏది ఏమైనా కొత్త తరం నాయకులను తయారు చేయాలనుకుంటున్న పవన్ ఆలోచన మాత్రం పార్టీకి మంచిదే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గంగిగోవు పాలు గరిటడైన చాలు అన్న సామెతలాగా పార్టీ కోసం విశ్వాసం నిబద్ధత చూపించే కొంతమంది నాయకుల కు టికెట్లు ఇచ్చి వారిని భవిష్యత్తు నాయకులుగా తయారు చేస్తే వారు ఎలాంటి పరిస్థితులలోనూ పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని, అలా కాకుండా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని సామాజికంగా వర్గంలో బలం ఉందన్న ఆలోచన తో టికెట్లు కేటాయిస్తే వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమ్ముడుపోయే అవకాశం ఉందని పవన ఆలోచనగా తెలుస్తుంది.ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ రాజకీయ నాయకుల వ్యవహార శైలి పై పూర్తిస్థాయి అవగాహనతోనే చాలా ముందుచూపుతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.