జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంత సీరియస్ గా రాజకీయాలపై దృష్టి పెట్టారు జనశెన అదినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ).అందులోనూ తనకు కంచుకోటని భావిస్తున్న గోదావరి జిల్లాలపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు.
వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాలను చుట్టేస్తున్న పవన్ తన పర్యటిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ అక్కడ స్థానిక మేధావులు, వ్యాపారవేత్తలు కుల పెద్దలతో సమావేశం అవుతూ అక్కడ స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటూ ఉండడం విశేషం.రాష్ట్రం మొత్తానికి ఒకటే మ్యానిఫెస్టో అన్నట్టుగా కాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటూ దానికి సరైన పరిష్కారాలనుహామీ ఇస్తూ జనసేన ప్రభుత్వం వస్తే ఆ సమస్యలను వెంటనే తీరుస్తామని నమ్మకం ఇస్తూ ముందుకు వెళుతున్న పవన్ వారాహీయాత్ర( Varahi Yatra )కు విశేష ప్రజా స్పందన కనిపిస్తుంది.
ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోతూ కేవలం యువతను మాత్రమే ఆకర్షించేలా ప్రసంగాలు చేసే పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి పరిణితి చెందిన రాజకీయ నాయకుల వ్యవహరిస్తున్నారు.ఆయా వర్గాలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తూ సాదారణ ప్రజల లో ఆలోచన కలిగేలా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ గోదావరి జిల్లాలో తనను అధికారానికి చేరుస్తాయని పవన్ బలంగా నమ్ముతున్నారు.ఏదో ఊహాగానాలతో కాకుండా గత ఎన్నికలలో వచ్చిన ఫలితాలను, సర్వే రిపోర్టులను దగ్గర పెట్టుకొని మరీ పవన్ రాజకీయం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
ఈసారి గోదావరి జిల్లాల పవన్ ను అసెంబ్లీకి తీసుకువెళ్తాయని జనసైనికులు కూడా గట్టిగా నమ్ముతున్నారు.ఆయన యాత్రకు వస్తున్న స్పందన కానీ దానిపై జరుగుతున్న మీడియా చర్చలు గానీ చూస్తుంటే ఈసారి జనసేన గట్టిగానే సౌండ్ చేసేలా కనిపిస్తుంది క్రమంగా మండలాల వారి కమిటీలను, నియోజకవర్గ ఇన్చార్జిలను కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చే ఎన్నికలకు ఈ ప్రజా అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకుంటే మాత్రం జనసేనకు తిరుగుండదు అన్న విశ్లేషణలు రాజకీయ విశ్లేషకులు నుంచి వస్తున్నాయి అయితే ఇదే వూపు ను ఉత్తరాంధ్రలో కూడా కొనసాగించాల్సిన బాద్యత మాత్రం పవన్ మీదే ఉంది అని చెప్పవచ్చు .