స్మార్ట్‌ఫోన్( Smartphone ) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతుల్లోకి వచ్చేసింది.ఏది కావాలన్నా, అవసరమైనా మొబైల్ నుంచే చేసుకునే వెసులుబాటు దొరికింది.
ఏ పని అయినా సరే స్మార్ట్‌ఫోన్ ద్వారా సులువుగా అవుతుంది.అలాగే ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్‌ను కూడా స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.
ఇప్పటికే హార్ట్‌బీట్ లాంటివి మొబైల్ ద్వారా తెలుసుకునే టెక్నాలజీ ఎప్పుడో వచ్చేసింది.మన గుండె కదలికలను అంచనా వేసి నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుందనేది తెలుసుకోవచ్చు.

అయితే హార్ట్‌బీట్‌నే కాదు.ఇక నుంచి స్మార్ట్‌ఫోన్ ద్వారా మీకు జ్వరం వచ్చిందో.లేదో సులువుగా తెలసుకోవచ్చు.దీని కోసం సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు.ఒకప్పుడు జ్వరం తీవ్రత తెలుసుకోవాలంటే ధర్మామీటర్ ( Thermometer )వాడేవారు.నోట్లో ధర్మామీటర్ పెట్టడం లాంటివి చేసేవారు.
కానీ ఇప్పుడు జ్వరం చెక్ చేసుకునేందుకు అనేక పరికరాలు వచ్చాయి.అనేక డిజిటల్ పరికరాలు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ డిజిటల్ పరికరాల ద్వారా చేతిపై స్కాన్ చేస్తే మీకు శరీర ఉష్ణోగ్రత( body temperature ) ఈజీగా తెలుసుకోవచ్చు.జస్ట్ కొన్ని సెకన్లలో మీ శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుని ఫీవర్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.

అయితే ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్ ద్వారా జ్వరం తీవ్రతను తెలుసుకునేలా సరికొత్త టెక్నాలజీ వస్తోంది.వాషింగ్టన్ యూనివర్సిటీకి( University of Washington ) చెందిన సైంటిస్టులు ఫీవర్ యాప్‌ను రూపొందించారు.ఈ యాప్ ద్వారా జ్వరం తీవ్రతను సులువుగా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు.ఈ యాప్ మీ శరీర ఉష్ణోగ్రతను అంచనా వేసేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌ను ధర్మామీటర్‌గా మార్చేస్తుంది.
ఫోన్‌లో ఉన్న టచ్ స్క్రీన్ సహాయంతో మీ బాడీ ఉష్ణోగ్రతను తెలియచేస్తుంది.ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేయాలి.ఆ తర్వాత కెమెరా లెన్స్‌ని నుదుటిపై 90 సెకన్ల పాటు ఉంచితే సరిపోతుంది.